జీవిత దశలను కాదు నీ జీవిత దిశని మార్చుకుని ఆపై ఇతరుల జీవితాలను మార్చే దిశగా మారటానికి తోడ్పడేది. ఈ "ది ఫైర్". నీ నిరర్ధక ఆలోచనలకు మంటను పెడుతుందీ ఫైర్. అందకారమనే అజ్ఞానాన్ని తొలిగించి జ్ఞానమనే వెలుతురు వైపు దారి చూపే కాగడా ఈ పుస్తకం. మనిషి బ్రతుకు బాటలో చీకటిని రూపుమాపుతూ దారి చూపాలని ఈ రచయిత చేసిన ప్రయత్నం ఎంతో వెలుగు ప్రదాయకం.