ఇప్పటికి పురుషాధిక్యత ఉన్న దేశంలో వెయ్యేళ్ల క్రిందట ఒక స్త్రీ మంత్రి ఎలా అయింది? ఎందుకైంది ? నిలదొక్కుకొని తనను తాను ఎలా నిరూపించుకుంది? రుద్రమదేవి మహారాజు కూతురు . రాజ్యం వారసత్వం .... పాలనా సామర్థ్యం తండ్రి శిక్షణలో లభించింది .కానీ వ్యవసాయ కుటుంబం లో పుట్టి వైవిద్యంలో ఉండి. మంత్రి కావటం... వ్యూహాలు ,సామర్ద్యాపాలన ,యుద్ధనైపుణ్యం ,చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం ... ఆలోచిస్తే ఎంత గొప్ప మనిషై ఉండాలి నాగమ్మ ? ఎంత సామర్థ్యం ,తెలివి ఉండాలి ?ఎంత శ్రమ చేసి ఉండాలి ? ఆంక్షల్ని,అధిపత్యాల్ని ధిక్కరించినందుకు ఆమెను నాయకురాలి పాత్ర నుండి లాగిపారేసి ప్రతినాయకురాలిగా ముద్ర వేసి కసి తీర్చుకుందా మన సమాజం ?ఒక స్త్రీ సామర్ధ్యాన్ని ఒప్పుకోక తప్పని స్థితి ఏర్పడితే దానికి దుష్టత్వాన్ని ఆపాదించి సంతృప్తి చెందిందా మనువు భావాల్ని పుణికి పుచ్చుకున్న పెత్తనం?
పల్నాటి చరిత్ర ప్రచారంలో నాగమ్మకు అన్యాయం జరిగిందని !ఆమెను నేరుగా ఏ విషయంలోనూ గెలవలేక .... దుర్మార్గురాలిగా చిత్రీకరించిన కుట్ర ఇది అని రచయిత నిరూపించారు .