ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రజల గతాన్ని ఆవిష్కరించే సందర్భంలో రచన ఊహాజనితమయి, నిజాలకు దూరమై అభాసుపాలయ్యే ప్రమాదముంది. కాని రావుగారు నిర్దిష్టమైన ఆధారాలతో తన ప్రతిపాదనలను చేస్తారు. ఇలాంటి రచనలు పాలకుల గురించే కాకుండా, సామాన్యప్రజల జీవన విధానాల గురించి కూడా వస్తే బావుంటుంది. భారత ఉపఖండంలోని ఇతర ప్రాంతాలు, ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాలనుంచి ఇటువంటి రచనల ఆవశ్యకత ఎంతో ఉంది.