త్రిశంకుడెవరు? శరీరంతో స్వర్గానికి చేరాలనుకున్న ఆ తలక్రిందుల రాజు కోరిక తీరిందా? సీత రావి చెట్టుకు ఇచ్చిన వరం ఏమిటి? శివుని ఆత్మ లింగం వరంగా పొందిన రావణుడు లంకకు వెళ్ళకుండా ఆపినదెవరు? మన కనురెప్పల కథ ఏమిటి? సత్యనిష్ఠ కల రాజు ఎదుర్కొన్న పరీక్షలు ఎలా ఉంటాయి! వేయి చేతులు గల మనిషిని చూశారా? కృష్ణుని ఆఖరి గడియలు ఎలా గడిచాయి? చందమామ ఎందుకు నవ్వాడో, చేప పొట్టలో శిశువు ఎలా దొరికాడో మీకు తెలుసా? ఈ సంకలనం లోని రాముని, కృష్ణుని అవతార కథలు వారి వంశ క్రమాన్ని చెబుతాయి. పిల్లల్నీ, పెద్దల్నీ ఆకర్షిస్తాయి. దేవతలు, రాక్షసులు - మనుష్యులతో కలసి నడిచిన ఈ కథలు, మాట్లాడే జంతువుల వైనాలు, దేవతలు సామాన్య మానవులకు అద్భుత వరాలు ప్రసాదించిన వివరాలు చెబుతాయి. ప్రజాదరణ పొందిన రచయిత్రి సుధామూర్తి మమ్మల్ని కట్టిపడవేసే కథా యాత్ర చేయిస్తారు.