ఈ పదకోశం ఆధునిక ప్రమాణ రూపాలను మాత్రమే గ్రహించింది. అంతేకాదు ఇతర నిఘంటువులలో సులభంగా లభ్యంకాని పర్షో అరబిక్ పదాలు, ఆంగ్ల పదాలు కొన్ని ఇందులో లభిస్తాయి. సమాచార రంగంలో వ్యాప్తిలో వున్న మరికొన్ని పదాలను కూడా చేర్చాము. ఇది ఒక తొలి ప్రయత్నం మాత్రమే. ఇంకా ప్రసార సాధనాల్లో నలిగిన చాలా అన్య దేశ్యాలనూ, సృజనాత్మక భాషలో కనిపించే మరెన్నో మాండలిక పదాలనూ నిఘంటువులలో మనం చేర్చుకోవలసిన అవసరం ఎంతో వుంది.ఈ వాడుకతెలుగు పదకోశంలో దాదాపు 20,000 పదాలు ఉన్నాయి. తెలుగు భాషాభిమానుల సూచనలను అనుసరించి మలి ముద్రణలో ఈనాటి అవసరాలకు తగినట్లుగా మరిన్ని పదాలను ఈ కోశంలో చేర్చడానికి ప్రయత్నిస్తామని సవినయంగా మనవి. మా ఈ తొలి ప్రయత్నాన్ని సమాదరిస్తారని ఆశిస్తూ....