తక్కువ అక్షరాస్యత, జనాభా ఉన్నప్పటికీ తక్కువ వృద్ధిరేటులో అదేవిధమైన అభివృద్ధిపథంలో ఉన్న, వికాసం చెందుతున్న ప్రజాస్వామ్యదేశం భారతదేశం. మార్కెట్ శక్తులమీద ఆధారపడ్డ చైనా సామ్యవాదం నుండి మన దేశం నేర్చుకోవలసిన గుణపాఠాలేమిటి?
ఒకటి, స్పష్టమైన సమైక్యతతో అన్ని స్థాయిల్లోనూ, ప్రాంతాల్లోనూ శీఘ్ర ఆర్థిక లక్ష్యం పట్ల నిబద్ధత. రెండు, సమర్థమైన పాలన, నిర్వహణశైలి, పెద్దఎత్తున ఎఫ్‌డిఐలను ఆకర్షించడానికి వీలుగా అన్ని ప్రధాన నగరాలు, వృద్ధిప్రాంతాలలో మౌలికవసతుల నిర్మాణం.
చైనా-భారత దేశాలు రెండూ అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం ఉన్న వర్తమానశక్తులు. తన అత్యున్నత వృద్ధిరేటు స్థానాన్ని చైనా అధిగమించగా భారతదేశం ఇంకా ఆ స్థానం చేరుకోలేదు. రాబోయే సంవత్సరాలలో భారతదేశం చైనా వృద్ధిరేటును అధిగమించవచ్చునని అంచనా.