సహజమైన జీవన విధానానికి మనమెంత దూరమైతే, చిత్త శాంతి మనకంత దూరమవుతుంది. ప్రపంచీకరణ, తద్వారా పెరిగిన వస్తు వినిమయ సంస్కృతి, మనని ప్రకృతికి దూరంగా నెట్టేస్తున్నాయి. ప్రకృతివడిలో ఒక వనవాసిలా పెరిగిన నాకు నేలకొరిగే ప్రతి చెట్టూ ఒక విషాదగీతాన్ని వినిపిస్తుంది. వేకువ పాటని గుర్తు చేస్తుంది.