తన ఫోన్ నెంబరు కనుక్కోవటానికి ఆమె ఇచ్చిన గడువు పూర్తవడానికి సరిగ్గా 118 నిమిషాలు మాత్రమే ఉంది. విమానం బయల్దేరటానికి రన్‌వే మీద సిద్ధంగా ఉంది. అప్పుడొచ్చింది అతడికి ఫ్లాష్లాటి ఆలోచన.
ఫలితం...?
కదుల్తున్న విమానం ఆగిపోయింది. అతడి కోసం మైక్‌లో ప్రకటనల మీద ప్రకటనలు వినవస్తున్నాయి. అతడు మాత్రం తాపీగా ఫోన్ చేస్తున్నాడు. మొత్తం టెలిఫోన్ డిపార్టుమెంటంతా వలవేయబడింది. చివరి క్షణంలోనైనా ఆమె (నెంబరు) అతడికి దొరికిందా...?
ఆక్స్ఫర్డ్ అమ్మాయికి చదరంగం ఛాంపియన్‌కి జరిగిన నాజూకు పోరాటం -
చిరు చిరు లెక్కల గిమ్మిక్కుల నుంచి పైతాగరస్ సిద్ధాంతం వరకూ -
టెలిఫోన్ డిపార్టుమెంట్ తీరుతెన్నుల బ్యాక్‌డ్రాప్‌తో -
క్షణక్షణం మిమ్మల్ని సస్పెన్స్‌లో పెట్టి, పూర్తయ్యాక ఒక మధురభావాన్ని మీ మనసులో కలకాలం నిలబెట్టే నవల.
చదవండి!