పురుషోత్తం అగ్రవాల్ బహుకాలంగా భారతీయ చరిత్ర, సాహిత్యం, సంస్కృతులపై లోతైన పరిశోధన చేస్తున్నారు. మౌలికమైన ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు, వాటి ఆధారంగా ప్రచలితమై ఉన్న సిద్ధాంతాలను పునః చర్చించి పునర్నిర్వచించే ప్రయత్నం చేస్తున్నారు. పత్రికలు, టెలివిజన్, ఛానళ్ళలో నిశితమైన వ్యాఖ్యానాలను ప్రసిద్ధుడైన పురుషోత్తం అగ్రవాల్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషనులో సభ్యుడుగా ఎంపికైన తొలి హిందీ ఆచార్యుడు. అగ్రవాల్ పదిహేడు సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో హిందీ బోధించాడు.
మన సాంస్కృతిక వికాసం గురించీ, దేశీయమైన ఆధునికత గురించీ మనకు పురుషోత్తం అగ్రవాల్ ఈ పుస్తకం కొత్త చూపునందిస్తూ ఉంది. కబీరును అధ్యయనం చేయడానికి ఒక నూతన దృక్కోణాన్ని అందిస్తూంది. మనం ఎప్పుడో ఆలోచించడం మానివేసిన విషయాల గురించి మళ్ళీ ఆలోచించవలసిన అవసరాన్ని గుర్తి౦పజేస్తుంది.