PublisherKanna Bhannu Publications ISBNVPHTO0073 AuthorDr.S V Styanarayana, Dr Kandimalla Bharathi LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages166
Description
దశాబ్దాల క్రితమే సమసమాజ నిర్మాణ ఆకాంక్షతో శ్రమదోపిడి దొంగలను హెచ్చరిస్తూ ప్రగతిశీల గేయాలు రచించిన కవి యలమంచిలి విజయకుమార్. రాసిన గేయాలు కొన్నే అయినా ప్రజానాట్యమండలి గాయనీ గాయకుల నాలుకలపై నాట్యం చేస్తున్న అద్భుతమైన ఆణిముత్యాలవి.
భౌతికవాద తాత్త్విక విమర్శకుడిగా అభ్యుదయ రచయితలకు నిత్యపఠనీయ గ్రంధాలు అనదగిన సాహిత్యం - వాస్తవికత సాహిత్యం - మానవుడు గ్రంధాలను రచించడం ద్వారా మార్కిస్టు దృక్పథంతో సాహిత్యాన్ని అధ్యయనం చేసే మార్గాన్ని చూపిన పథనిర్దేశకుడు. 1918 సెప్టెంబర్ 15 న గుంటూరు జిల్లా పాత తెనాలి తాలూకాలోని తురిమెళ్ళ గ్రామంలో పుట్టిన యలమంచిలి విజయకుమార్ తండ్రిగారు శ్రీ యలమంచిలి రాఘవయ్యగారు 12 భాషల్లో నిష్టాతులైన పండితులు. తత్వశాస్త్రజ్ఞులు. వారి ద్వారా నిరంతర గ్రంథపఠనాన్ని వారసత్వంగా అందిపుచ్చుకున్న విజయకుమార్ నిరంతర అధ్యయనశీల నిర్విరామ ఉద్యమశీలి.