PublisherN K Publications AuthorChaganti Tulasi ISBNNKP001 LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages160
Description
ఏదయినా చదివితే, అది మనకో చక్కని అనుభవం కావాలి. మనసు వికసించాలి. కొంచెం సేపు పుస్తకం మూసి 'మ్యూజింగ్స్' లోకి వెళిపోగలగాలి. బలవంతాన రెక్కపట్టుకు చదివించాల్సి వస్తే ఆ రచన ఏమయినా కావచ్చు గాని మంచి ఫిక్షన్ మాత్రం కాజాలదు.
మంచి కథలూ, మంచి నవలలూ ఏ అంచుల మీద నిలబడి మనలను పలకరిస్తాయో ఆలా ఈ 'యాత్ర' కథ మనల్ని పలకరించి మన మనోమందిరంలో మూసుకున్న కిటికీ తలుపుల్ని తెరుస్తుంది. ఇంద్రచాపాన్ని పట్టి చూపిస్తుంది.