Creative Links

STHANAM NARASIMHARAO Natajeevana Prasthanam By Modali Nagabhushana Sarma

Be the First to Review
180200 ( 10% OFF)
Only 5 In-Stock
Delivery
Enter pincode for exact delivery dates and charge
Safe and Secure payments.100% Authentic products
Specifications
PublisherCreative Links AuthorModali Nagabhushana Sarma ISBNCreative0034 LanguageTelugu BindingPaperback No. of Pages146
Description

ఒక కళారంగంలో అనితరసాధ్యమైన విజయాలను సాధించిన కళాకారులందరూ తరువాతి తరాలవారికి మార్గదర్శకులే. అటువంటి ఉత్తమ కళావేత్త శ్రీ స్థానం నరసింహారావు. పురుషులే స్త్రీ వేషాలు వేసే రోజుల్లో రంగస్థలం మెట్టి విభిన్నమైన - ఒక్కొక్కప్పుడు పరస్పర విరుద్ధమయిన - పాత్రలను ధరించి, ధరించిన ప్రతి పాత్రలోను తనదైన ప్రత్యేకతను చూపించి ముప్ఫయి సంవత్సరాలపాటు లక్షలాదిమంది ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ప్రతిభ ఆయనది. నటకావతంస, నటశేఖర, నాటకకళా ప్రపూర్ణ, పద్మశ్రీ వంటి బిరుదలు, పురస్కారాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. ఈ సత్కారాలకు, అశేష ఆం్ధఆవని నీరాజనాలు పలకడానికి ముఖ్యమైన కారణాలు రెండు: ఒకటి తాను చేస్తున్న పనిలో నిమగ్నత, రెండు ఆ పనిమీద భక్తి ప్రపత్తులు. తన వృత్తి యెడ అంతటి గాఢమైన మమకారం. గురువులు చెప్పిన సూత్రాలను తన చిత్తవృత్తికి అనుగుణంగా మార్చుకొని మసలుకోవడం, ఏ పాత్ర చేస్తున్నా దాని పూర్వాపరాలను కూలంకషంగా అధ్యయనం చేయడం నటుని ప్రాధమికమైన అవసరాలుగా గుర్తించి పాత్రల కదలికలను, హొయలను, కోపాన్ని, తాపాన్ని - యిలా పాత్రోచిత భావ వైవిధ్యాన్ని మననం చేసుకొని అమలుపరచడం స్ధానం నటజీవన విశిష్టత. నాటకరంగానికే జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడాయన

ga('require', 'GTM-MFKMTZP')"ca-pub-3602039493756659",